info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయం -బీమవరం




దేవతలకు ,రాక్షసులకు జరిగిన యుద్ధం లో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి వదించి అతని కంఠం లోని అమృత లింగాన్ని అయుదు ఖండాలుగా కండిస్తాడు. ఆ అయుదు అయుదూ ప్రదేశాల్లో పడుతాయి అవె పంచారామాలు .
(1) అమరారామము (అమరావతి )
(2) సోమారామము (బీమవరం)
(3) క్షీరారామము (పాలకొల్లు )
(4) ద్రాక్షారామము (ద్రాక్షారామము )
(5) కుమారారామము (సామర్లకోట )

పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామం క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో వెలసింది . ఇక్కడ స్వామి వారు శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి గ వెలుగొందుతున్నారు . భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. 4 వ శతాబ్దం లో చాళుక్యులు కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రసిద్దిగాంచిన క్షేత్రం . ఈ క్షేత్రం లో ని చంద్రుడు ప్రతిష్టించినట్లు పురాణాలూ చెబుతున్నాయి . చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. గర్భ గుడి సమీపం లో అన్నపూర్ణ దేవి ఆలయం ఉంది . ఇక్కడ ఆలయ ప్రాంగణం లో ఉన్న కొలనుని సోమగుండం అని కూడా పిలుస్తారు .


శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి భూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది తిరిగి పౌర్ణమివచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఆలయపు ముందు బాగమున కోనేరు కలదు ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది.


దేవాలయ ప్రాంగణం లో మనం ఆంజనేయ స్వామి ,కుమార స్వామి ,నవగ్రహాలు ,సూర్య దేవుడు ,గణపతి లను దర్సిన్చుకోవోచు . ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.




Bhimavaram is located 107 Kms from Vijayawada & 270 Kms from Visakhapatanam.

Route Map:-