info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ గంగా పార్వతి ముక్తేశ్వర స్వామి దేవాలయం -ముర్తోట




దక్షిణ చిన్న కాశి గ పిలవబడే ఈ ప్రాంతం లో శ్రీ గంగా పార్వతి ముక్తేశ్వర స్వామి కృష్ణ నది ఒడ్డున కొలువై ఉన్నాడు . అతి ప్రాచీనమైన దేవాలయం ఇది.


అందమైన కృష్ణ నది ప్రవాహం ,గల గల పారే కృష్ణమ్మా ఒడ్డున,దీవి సీమ లో వెలసిన మహిమన్మితమైన శైవ క్షేత్రం ముక్తేశ్వర స్వామి దేవాలయం .


రేపల్లె- అవని గడ్డ వల్లే ప్రధాన రహదారి లో లోపలికి సుమారు 15 కి మీ దూరం లో మోర్తట లో వెలసిన శివాలయం ప్రకృతి ఒడి లో ,పచ్చని చెట్లు ,చుట్టూ నిల్లు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్ని విదంగా ఉంటుంది ఈ దేవాలయం .


చిన్న కాశి గ పిలవబడే ఈ దేవాలయం లో ఉన్న స్వామి వారు గంగ పార్వతి సమేతంగా కొలువై ఉన్నారు . ఇక్కడ ఉన్న విగ్రహం ఎంతో మహిమన్మిథమైనది మరియు శక్తి వంతమైనది అని చెబుతారు .



ప్రతి సంవత్సరం మహా శివ రాత్రి సమయం లో ఇక్కడ జరిగే ఉత్సవాలు ఘనంగా,శోబయమానంగా ఉంటాయి . జీవిత కాలం లో ఇటువంటి క్షేత్రాలని తప్పకుండ దర్శించి తరించి తీరాల్సిందే !!
కృష్ణమ్మా ఒడ్డున స్నానం చేసి స్వామి వారిని దర్శించి కోరికలు కోరుకుంటే తప్పకుండ తీరుతాయని ,జీవిత కాలం లో చేసిన పాపాలు అన్ని హరించి ముక్తి లబిస్తుంది అని స్థల పురాణం చెబుతుంది .