info.manatemples@mail.com

+91 9866933582

భావిగి భద్రేశ్వర దేవాలయం -తాండూర్




భాగ్యనగరానికి సుమారు 125 కి మీ దూరం లో ఉన్న తాండూర్ పట్టణం లో వెలసిన పురాతన దేవాలయం భావిగి బద్రేశ్వర ఆలయం. వీరభద్ర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు .150 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయానికి దగ్గరలో నే కగ్న నది ఉన్నది.ఇక్కడ రోజు స్వామి వారికి పూజలు,అభిషేకాలు చాల శాస్త్రోక్తంగా జరుగుతాయి. పెల్లిలు జరగడానికి,మంచి ఆయురారోగ్యాల కోసం భద్రేశ్వర స్వామి వారిని భక్తులు దరిస్స్తుంటారు!!అలాగే ఇక్కడ కోరికలు కూడా నేరువేరుతాయని భక్తుల నమ్మకమ్.


ఈ ఆలయానికి చరిత్ర ఉంది. అదేమిటంటే, కర్నాటకా రాష్ట్రంలో బీదర్ జిల్లాలో భావిగ అనే కుగ్రామంలో 200 సంవత్సరాల క్రితం భద్రప్ప అనే అతను జన్మిం చాడు. ఇతడు సాక్షాత్తు వీరభద్రుని అవతారమని అక్కడి వారి నమ్మకం. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగలో కూడా అత్యంత వైభవంగా వేడుకలు జరుపుతారు. తాండూరుకు చెందిన పటేల్ బసవన్న అనే భక్తుడు ఏటా భద్రప్ప ఉత్సవాలకి ఎడ్లబండ్లు కట్టించుకుని వెళ్ళి ఎంతో భక్తితో పూజలు నిర్వహించి తిరిగి తాండూరు చేరుకునే వాడు. ఒకసారి ఇలాగే ఉత్సవాలకి హాజ రయ్యి తిరిగు ప్రయాణం అవుతూ భద్రేశ్వ రునికి వెళ్ళి వస్తానని మనసులో విన్నవించుకున్నాడు. ఎడ్లబళ్ళు ఎక్కి వస్తూండగా ఒక బాలుడు పటేల్ బండి వెనుక నడుచుకుంటూ వస్తున్నాడు.


పటేల్ అతనిని భద్రేశ్వరుడిగా గుర్తించి, బండి ఎక్కమని అనగా అందుకు ఆబాలుడు అంగీకరించలేదు. అలాగే తాండూరు వరకూ వచ్చి, ఇప్పుడున్న దేవాలయం స్థలానికి రాగానే మాయం అయిపో యాడు. అదేరోజు పటేల్ బసవన్నకి కలలో కనిపించి తన పాదుకలు భావిగ నుంచి తెచ్చి, వాటిని ఇక్కడ ప్రతిష్టించి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. ఆయన చెప్పినట్టే పటేల్ బసవన్న ఆలయ నిర్మాణం చేసాడు. నాటినుండీ ఈ ఆలయం ఎంతో వైభవంతో వెలుగొందుతోంది. ఈ ప్రాంతంలో స్వామి మహిమలెన్నో ప్రచారంలో ఉన్నాయి.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం లో ఇక్కడ తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి!!

భుకైలాష్ - తాండూర్







తాండూర్ పట్టణం లో వెలిసిన మరో పుణ్య ధామం భుకైలాష్ .ఇక్కడ 65 అడుగుల శివ విగ్రహం మరియు 35 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వెలసి ఉన్నాయి . శివుడి విగ్రహం కింది బాగం లో లింగాన్ని ప్రతిష్టించారు . ఆలయ ప్రాంగణం లో శివాలయం తో పాటు చాల రకాల ఉపాలయాలు కూడా ఉన్నయి.
గణేష్ దేవాలయం
అయ్యప్ప స్వామి దేవాలయం
రాఘవేంద్ర స్వామి దేవాలయం
రాధాకృష్ణ దేవాలయం
వెంకటేశ్వర స్వామి దేవాలయం
సాయిబాబా మందిరం
అమ్బభావని
లక్ష్మి దేవి ఆలయం
నవగ్రహ మండపం కూడా నిర్మించారు
అందరు దేవగణాలు ఒకే దగ్గర వెలసి వుండడం వాళ్ళ ఇక్కడ భూలోకం లో ఉన్న కైలాసంల మనకు అనిపిస్తుంది !!

వెళ్ళే మార్గం : హైదరాబాద్ -తాండూర్