info.manatemples@mail.com

+91 9866933582

చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం- పులిమామిడి గ్రామం
భాగ్యనగరానికి సమీపం లో శ్రీశైలం వెళ్ళే దారి లో కందుకూరు మండలం పులిమామిడి గ్రామం లో వెలసిన చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది మరియు ప్రాశస్త్యమైన క్షేత్రం కూడా. వందల శతాబ్దాల చరిత్ర గల దేవాలయంగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.


స్థల పురాణం :
విజయనగర నిర్మాణ శైలి లో నిర్మించిన ఈ దేవాలయం తూర్పు ముఖంగా ఉంటుంది . అక్కన్న మాదన్న కాలంలో దీని పునర్నిర్మాణం జరిగింది.గుహలో ఉండి చీకటిగా ఉండడం వలన చీకటి వేంకటేశ్వర స్వామి గా పేరు వచ్చింది అని కూడా చెబుతారు . ప్రతి సంవత్సరం మాఘమాసం లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరణ వైభవంగా జరుగుతాయి .

వెళ్ళు మార్గం : హైదరాబాద్ శ్రీశైలం వెళ్ళే మార్గం ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవొచ్చు .

Route Map:-