info.manatemples@mail.com

+91 9866933582

పాతగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణం కమనీయం
కనుల పండువగా శ్రీలక్ష్మీనారసింహుడి వివాహ వేడుక

శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణంతో పాతగుట్ట అపర వైకుంఠాన్ని తలపించింది. భక్తుల జేజేలు.. మేళతాళాలు.. వేద పండితులు, అర్చక బృందం, పారాయణికులు వేదఘోష నడుమ శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణ మహోత్స వం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీనారసింహుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని అర్చకులు, వేద పండితులు వైభవంగా జరిపారు.

అంతకు ముం దే స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. పండితుల వేదఘోష, భక్తజనం మధ్య గురువారం రాత్రి 7గంటలకు మొదలైన కల్యాణ వేడుక రాత్రి వరకు కొనసాగింది. కల్యాణ వేడుకను చూడటానికి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ముందుగా కల్యాణ మండపంలో విశ్వక్సేన ఆరాధన చేసి స్వస్తి పుణ్యాహవాచనం చేసి సంప్రోక్షణ చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఈవో గీతలకు కంకణధారణ చేశారు. స్వామివారికి బంగారు యజ్ఞోప వితధారణ చేశారు. స్వామి అమ్మవార్లకు మధ్య తెరపత్రం ఉంచి జీలకర్ర బెల్లం పెట్టి, అనంతరం ప్రత్యేక పూలమాలల దండలను మార్పిడి చేశారు. ప్రవరలను చెప్పి, నూ తన వధూవరులకు కన్యాదానం చేశారు. వేదపండితు లు, అర్చక బృందం, పారాయణికులు వేదఘోష మధ్య పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక కొనసాగింది. భక్తులు భాగ్యోత్సవాలుగా భావించే శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కల్యాణతంతును వీక్షించడానికి అశేష భక్తజనం పాతగుట్టకు తరలివచ్చారు. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ధన, కనక, వజ్ర, వైడూర్యా ల ఆభరణాలు, పట్టువస్ర్తాలతో అమ్మవారిని, స్వామివారిని అలంకరించారు. జై జై నారసింహ.. జైజై లక్ష్మీనరసింహ అంటూ భక్తుల కోలాటాల మధ్య గజవాహన సేవ ఆసక్తిగా నడిచింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో బ్యాండ్‌మేళాలు, కోలాట నృత్యాల నడుమ గజవాహనంపై స్వామి, అమ్మవార్లు ఆధ్యాత్మిక వాతావరణంలో కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.శ్రీవారి అనుగ్రహం..

శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం తిలకించిన భక్తులకు శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని స్కంధపురాణంలో స్పష్టం చేసిన విషయా న్ని కల్యాణోత్సవ వ్యా ఖ్యాత వివరించారు. సమస్త ప్రాణకోటికి, ప్రకృతి మండలానికి శ్రీలక్ష్మీనరసింహుడి అనుగ్రహం..సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని వేదాలు, ఇతిహాసాల్లో కూడా పేర్కొనబడి ఉం దని ఆయన తెలిపారు. స్వయంభూ పాంచరాత్రాగమ శాస్ర్తానుసారం కల్యాణోత్సవం నిర్వహించారు.పారాయణాలు, నిత్య హవనాలు..

నిత్యపూజల అనంతరం సాయంత్రం 5 గంటలకు పారాయణాలు, నిత్యహవనాలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణీకులు పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా నిర్వహించారు. శ్రీవారి తిరుకల్యాణ మహోత్స వం అలంకార సేవ గజవాహనంపై ఆస్థాన మండపానికి వేంచేయగా, ప్రధానార్చక బృందం పర్యవేక్షణలో యాజ్ఞిక బృందం, అర్చక బృందం వేదపండితులు సుముహూర్తంలో శ్రీస్వామి వారి అమ్మవారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కల్యాణ విశేషాలను ప్రధానార్చకులు, వేద పండితులు వివరించారు. శ్రీస్వామివారి, అమ్మవారి వైభవాన్ని తెలియజేసే మహామంత్ర పుష్పపఠనం, చతుర్వేద పారాయణాలు మహదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం కల్యాణ దంపతులగు శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకారణ సేవ భక్తుల భజన, కోలాటాలతో బ్యాండ్‌ మేళతాళాల మధ్య వేడుకగా నిర్వహించారు. పట్టువస్ర్తాలు సమర్పించిన కలెక్టర్‌ పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవంలో భాగం గా స్వామి, అమ్మవార్లకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పట్టువస్ర్తాలను సమర్పించగా, ఆలయం తరఫున ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి పట్టువస్ర్తాలు, పండ్లు సమర్పించారు.గజవాహన సేవ ప్రత్యేకత

ఐరావతం గజేంద్రాణాం అని కృష్ణభగవానుడు గీతలో అన్నాడు. శ్రీవారు సామాన్యమైన గజంపై కాక దిగ్గజం అయిన ఐరావతంపై ఊరేగుతాడు. ఏనుగు శరీరం పెద్దది, కండ్లు మాత్రం చాలా చిన్నవి. కానీ ఎంత చిన్న వస్తువునైనా వాటి కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇదొక గొప్ప దృష్టి విన్యాసం. అంటే పరమాణువులో కూడా పరబ్రహ్మాన్ని గొప్పగా దర్శించే ఉన్నత స్థితికి చేరుకోమంటుంది ఏనుగు. గజవాహనం సేవ ద్వారా వివ్య సందేశాన్ని గ్రహించే అవకాశం భక్తులకు కలుగుతున్నది. భగవత్‌ స్మృతి కలిగి ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే తప్పక రక్షణ లభిస్తుందనే శరణాగత సిద్ధాంతాన్ని గజేంద్రమోక్షం కథ నిరూపిస్తుంది. జగద్రక్షకుడైన శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణంలో లోక కల్యాణార్థమేనని పురాణా ప్రసిద్ధి. బ్రహ్మాది దేవతలు ఆనాడు శ్రీస్వామి వారికి నిర్వహించిన కల్యాణ సంబురాలే ఆగమశాస్ర్తానుసారంగా బ్రహ్మోత్సవాల్లో నిర్వహించడం నేటికీ ఆనవాయితీ. కల్యాణోత్సవం జరుపుకొన్న వేళ శ్రీవారు ఎంతో ప్రసన్నతతో ఉంటారని, అందువల్ల అమ్మవారితో కూడిన భగవానుడిని సేవించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో పేర్కొన్నారు.

హనుమంత వాహన సేవ ప్రత్యేకత

దాస్య భక్తికి ప్రతీక ఆంజనేయస్వామి వారు భగవంతుడి గుణతత్వ, రహస్య ప్రభావాదులను తెలుసుకొని శ్రద్ధపూ ర్వకంగా ఆయన సేవలు చేయడం, ఆయన ఆజ్ఞలు శిరసావహించడం దాస్యభక్తి అవుతుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి క్షేత్రపాలకుడిగా శ్రీ స్వామివారికి సేవలందిస్తూ వారి ఆశీస్సులను భక్తకోటికి అందజేసేందుకు నిరంతర కైంకర్యం నిర్వహిస్తుంటారు. అందువల్ల హనుమంత వాహనంపై స్వామికి చేసే నమస్కారం శ్రీస్వామి వారికి వారి వాహనమైన హనుమంతుడికి ఒకేసారి చేరి భక్తులు అనుగ్రహ పాత్రులు అవుతారని నమ్మకం.
Route Map :-