మన దేవాలయాలు మన వారసత్వ సంపద


భారతీయ సనాతన ధర్మానికి , సంస్కృతికి దేవాలయాలు ప్రతిరూపాలు ,శిల్పం చిత్రలేఖనం ,సంగీతం,సాహిత్యం,నాట్య వంటి శాస్త్రా కళా సమ్మిళతమైన దేవాలయాలను సర్వజన సంక్షేమం కోసం,లోక కళ్యాణం కోసం నిర్మించినవే .
ఆలయ వాస్తు ప్రకారం శాస్త్రీయంగా నిర్మించబడిన ఆలయంలో విగ్రహమూర్తిని ప్రతిస్టించిన మహనీయులు తమ శక్తి చేత జరపబడుతున్న పూజా విశేషాదుల చేత శిల్పా ఆగమ లక్షణ సమన్వితమైన విగ్రహ సౌందర్యం వల్ల భగవంతుడు ఆ ఆలయంలోని బింబాన్ని ఆవహించి భక్తుల కోరికలు తిరుస్తూ ఉంటాడని శాస్త్ర ప్రవచనం . వైదిక సంస్కృతి కేంద్రాలయిన ఆలయాలను రక్షించుకోవడం,శిథిలవస్థ లో ఉన్న దేవాలయాలను ,మూర్తులను జీర్ణోద్ధరణ చేసుకోవడం లేదా పునర్నిర్మించుకోవడం మన అందరి విధి ,ధర్మం.
శిథిలమై,కలవిహీనమైన ఆలయాల వలన ఆ గ్రామాలకు ,అక్కడ ఉండే ప్రజలకు ,దేశానికి కూడా మంచిది కాదు అని శాస్త్ర వచనం . మన దేవాలయాలు మన వారసత్వ సంపద వాటిని కాపాడుకునే భాద్యత మనదే ! యెక్కడైతే దేవాలయాలు దుపా దీప నైవిద్యాలతో ప్రతి నిత్యం వెలుగొందుతాయో అక్కడ సుఖ సంతోషాలు వెళ్ళు విరుస్తాయి .
ఒక ధర్మం ఒక శక్తి .ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్య పైన కాకుండా దానిని ఆచారించే వ్యక్తుల స్వభావం పైన ఆదారపడి ఉంటుంది అలాంటి మహానుభావుల వల్లే మన ధర్మం నేటికీ నిలిచి ఉంది .
ప్రతినిత్యము సూర్యోదయంకు పూర్వమే లేచి స్నాన సంధ్యాధులు పూర్తి చేసుకొని గృహాన్ని శుద్ది చేసుకొని పూజా పునస్కారాలు నిర్వహించడం , సూర్య నమస్కారాలు చేయడం, ధైవ ప్రార్థనలు చేయడం, గృహం లో సామ్రాని తో పొగ వేయడం ,ఉన్న దాంట్లో కొంచెం ధాన ధర్మాలు చేయడం యెంతో ప్రశాంతత ను ,శుబాలను ప్రసాదిస్తాయి .