info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ మహాబలేశ్వరస్వామి దేవాలయం, గోకర్ణ, కర్ణాటక.
గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. బెంగళూరుకి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరంలో ఉంది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది. మహాబలేశ్వర దేవాలయ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది.
రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.
రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు. రావణాసురుడు సంధ్యవార్చు కోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తిమీద మొట్టుతాడు, గణపతి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం
విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

గణపతి దేవాలయం

మహాబలేశ్వర ఆలయానికి ప్రక్కగా గణపతి ఆలయం ఉంటుంది. రావణాసురుడు తల మొట్టాడు అనడానికి గుర్తుగా గణపతి తలమీద ఒక గుంట ఉంటుది.గణపతిని అందరు సృశించవచ్చు, గణపతి అభిషేకం చేయవచ్చు. భద్రకాళి దేవాలయం
మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనే భద్రకాళి దేవాలయం ఉంది. భద్రకాళిని అన్నపూర్ణమ్మ తల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిలో తక్కెడ సరిసమానంగా ఉండకుండా ఒక వైపు ఒరిగి ఉంటుంది, దానికి కారణంగా కాశిలో గంగ మాత్రమే ఉన్నది, కాని గోకర్ణలో కోటి తీర్థం, సముద్రం (ఇక్కడి అరేబియా సముద్రం పుణ్య తీర్థంగా భావిస్తారు.) ప్రాంతీయులు చెబుతారు.


కోటి తీర్థం

గ్రామములోని తటాకం లేదా కోనేరు. ఈ కోటీ తీర్థాన్ని గంగతో సమానంగా ప్రాంతీయులు భావిస్తారు. పితృ తర్పణాలు ఇక్కడ సమర్పిస్తారు.. గోకర్ణ ఎలా చేరుకోవాలి

ఆలయం దర్శనం సమయం: ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తిరిగి సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు


వాయు మార్గం : గోకర్ణ కు సమీపాన గోవాలోని డబోలిం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని గోకర్ణ చేరుకోవచ్చు.
రైలు మార్గం : గోకర్ణ లో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన అంకోలా రైల్వే స్టేషన్ కలదు. ఇది 20 కి. మీ ల దూరంలో ఉంటుంది. ఈ స్టేషన్ నుండి స్థానిక బస్సు లేదా టాక్సీ లలో గోకర్ణ చేరుకోవచ్చు.
రోడ్డు / బస్సు మార్గం : బెంగళూరు, హుబ్లీ, మంగళూరు, మార్గోవా తదితర ప్రాంతాల నుండి గోకర్ణ కు ప్రతి రోజూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి