info.manatemples@mail.com

+91 9866933582

బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం,పుల్లగుమ్మి గ్రామం,వెల్దుర్థి మండలం,కర్నూల్ జిల్లా

కర్నూల్ జిల్లా వెల్దుర్థి మండలం పుల్లగుమ్మి గ్రామం లో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం.

కర్నూలు జిల్లాలో 21బుగ్గక్షేత్రాలు ఉన్నాయి అన్ని ఆలయాల్లో మహాశివరాత్రి కి ఉత్సవాలు జరుగతాయి కాని ఇక్కడ మాత్రమే శ్రీ రామనవమికి ఉత్సవాలు జరుగుతాయి అది కూడా అర్థరాత్రి పూట కళ్యాణోత్సవం, రథోత్సవం, జరుగుతుంది.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రామ లక్ష్మణులు నిరాయుదులుగా ఆయుధాలు లేకుండా అంటే ధనుస్సు బాణాలు లేకుండా దర్శనం ఇస్తారు సీతరామ లక్ష్మణ హనుమంతులవారు ఏక శిలపై వున్నారు . దాదాపు 500సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం నిరంతరాయంగా భూమినుండి ఉబికివస్తున్న గంగమ్మ ఉత్తర పచ్చిమ దిశల్లో ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆలయం శిథిలావస్థకు చేరుకుంది చాల ఏళ్ళు గాఉత్సవాలు జరగటంలేదు దొంగలు గుప్తనిదులకోసం తవ్వకాలుజరుపుతున్నారు. ఈ క్షేత్రం జిల్లా కేంద్రమైన కర్నూలు కు కూతవేటు దూరంలోనే వున్న పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు.

ఎలావెళ్లాలంటే..?
కర్నూలు నుంచి వెల్దుర్తి చేరుకొని అక్కడి నుండి ఈ క్షేత్రానికి సులువగా చేరుకోవొచ్చు