info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం –వేదాద్రి




ఇది విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారి నెం.9లో చిలకల్లుకు 10 కి.మీ. దూరంలో కృష్ణానదీ తీరంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంది.
వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో, నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాట పడుతుందనీ, అందువలన తాను వచ్చేంత వరకూ ఆ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తరువాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.


నవ నరసింహ క్షేత్రాలల లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణ నది ఒడ్డున చిలకల్లు కి 10 కి మీ దూరం లో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి లో ఉంది .
ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వామి. ముఖ్య దేవాలయములో యోగానంద మరియు లక్ష్మీ నృసింహస్వామి, కొండపైన జ్వాలా నృసింహస్వామి (నిజానికి కొండ గర్భములో దేదీప్యమానమైన వెలుగులతో అనగా జ్వాలలతో ఉన్నాడని ఆ కొండకు గల బిలము ద్వారా లోనికి వెళ్ళిన వారు అంటారు), కృష్ణానది గర్భములో స్నాన ఘట్టమునకు సమీపములో బయటకు కనిపించే రూపం సాలగ్రామము, వేదాద్రికి సమీపములోని గరుడాచల కొండపై వీర నృసింహస్వామి ఉన్నారు.అద్బుతమైన కట్టడాలు,యోగముద్రలో ఉన్న నృసింహస్వామి స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు .


యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడినది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.


ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా ,కనుల పండుగగా జరుగుతాయి .


.




Temple Full Address: Sri Lakshmi Narasimha Swami, Vedadri, Chillakallu, Jaggaiahpeta, Krishna District, Andhra Pradesh.


Landmark: It is situated only 10 km from Chillakallu on the National Highway No.9 from Vijayawada to Hyderabad.
How to reach :
By Bus: Buses are available from all places in Andhra Pradesh to Vedadri to access the temple. It is 5 km away from Jaggaiagpeta.
By Train: Nearest railway station is Madhira Railway Station which is 37 km away from the temple. Local buses run from here to visit the temple.
Route Map : -