info.manatemples@mail.com

+91 9866933582

అది వరాహ స్వామి దేవాలయం - తిరుపతి




దశావతారాల్లో వరాహ అవతారం ప్రసిద్దమైనది . వరాహ అవతారం లో జల ప్రళయం లో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కోరల మీద అదిదేవుడు రక్షించాడని పురాణాలూ చెబుతున్నాయి . దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి,వేదములను కాపాడిన అవతారము. రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసులబారినుండి రక్షించిన స్వామి.

మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రదేశాల్లో ఆది వరాహ స్వామి దేవాలయాలు ఉన్నయి. అందులో ఒకటి తిరుమలలో కాగ మరొకటి కమన్పూర్ లో వెలసింది .
కలియుగ ప్రారంబం లో శ్రీ వారు లక్ష్మి దేవిని వెతుక్కుంటూ వైకుంటం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు అశ్రయమిచ్చారని పురాణం కథనమ్. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామి ని దర్సించాకే తనను దర్శిస్తారని వరమిచ్చారట.
హిరణాక్షుడిని చంపి పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తెరుమలకొండ. తిరిమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది .
అయితే తిరుమలకొండ పై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే . వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు .


ఆదివరాహస్వామి గా ,
ప్రళయవరాహ స్వామి గా ,
యజ్ఞ వరాహస్వామి గా ,
ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపము .




వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపం తో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు . శ్రీనివాసుడే .. శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి . వరాహస్వామిరూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు . మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే ,, ముక్కోటి దేవతలు మురిసిపోయారట .



నాకు ఈ ప్రదేశం లో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది . ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా .. అప్పుడు ఆయన (వరాహస్వామి) మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు . అప్పుడు శ్రీనివాసుడు " నా దగ్గర ధనం లేదు , అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రధమ దర్శనము , ప్రధమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తానని " చెబుతాడు . అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తారు . శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి . శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి , . శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నేటి భక్తు్లు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైనాడు . రెండు అవతాలతో , రెందు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతా రహస్యాలలో ఈ రెండు అవతాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది .






Temple Timings: Every day from 5:30 AM to 12 PM and 5 PM to 9 PM.

map generator