info.manatemples@mail.com

+91 9866933582

సోమేశ్వర స్వామి దేవాలయం -సోమశిల




కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి ...


హైదరాబాద్ నుంచి దాదాపు దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్ (మహబూబ్నగర్ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్లు ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి. ఇక్కడి నుంచి నదిలో తూర్పువైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు సాగే ప్రయాణం.. జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ నదిలో నీరు పుష్కలంగా ఉండటం మూలంగా 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది.



కొల్లాపూర్ పట్టణానికి 10 కి మీ దూరం లో వెలసిన ఈ క్షేత్రం లో శివలింగాలు ప్రతిష్టతమైన 15 ఆలయాలు ఉన్నాయి. లలిత సోమేశ్వర స్వామి ఆలయం ప్రఖ్యాతి గాంచినది . పుష్కరాల సమయం లో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నది లో స్నామాచారిస్తారు .


ప్రస్తుతం ఈ దేవాలయం గ్రామానికి ఎగువ ప్రాంతం లో నిర్మించడం జరిగింది . ఆహాలధకరమైన కృష్ణమ్మా తల్లి వడి లో ప్రయాణించి క్షేత్రాన్ని సందర్సిన్చుకోవడం మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలమో !!



ప్రత్యేక పూజలు : -
శివరాత్రి , కార్తిక మాసం లో కార్తిక పౌర్ణమి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు .