info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం -పానగల్




పచ్చల సోమేశ్వరాలయం

12వ శతాబ్దం లో చాళుక్యులు కాలం లో నిర్మించిన ఈ దేవాలయం శిల్పకళ రూపాలు కళ్ళకు ఆకట్టుకునేల ఉంటాయి. దేవాలయం లోని మండపంలోని నాలుగు స్థంబాలపై వివాద రకాల దృశ్యాలు కనుల విందుగా ఉంటాయి . గర్భ గుడి లోపలి బాగం లోని గోడల పైన పలు రాఖల దేవత మూర్తుల శిల్పాలు ఉన్నాయి .


ఛాయా సోమేశ్వరాలయం
గర్బగుడిలో శివలింగం పైన 24 గంటలు రాత్రి పగలు తేడ లేకుండా స్థంబాల నీడా పడుతుంది . ఈ నీడ ఎలపడుతున్నది అన్నది ఇప్పటికి అంతుచిక్కని విషయం .




త్రికుట ఆలయం గ మూడు గృహాలతో నిర్మించబడి తూర్పు ముకంగా వున్నా గర్బ గృహం వెన్నెల కాంతి లో కనబడుతుంది. ఉత్తర బాగం లో ఉన్న గర్భ గుడి లో ఒక మనిషి నీడా ఏడుగురు నీడలా కనిపిస్తుంది .ఇది ఈ దేవాలయం ప్రత్యేకత!!
మహా శివరాత్రికి ఇక్కడ ప్రత్యేకమైన ,విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . అద్బుతమైన కట్టడం, దాని లో ఉన్న రమణీయత ను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఎ క్షేత్రాన్ని చూసి తరించాల్సిందే !!

పచ్చల సోమేశ్వరాలయం నుంచి చుస్తే ఒక కి మీ దూరం లో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం కనిపిస్తుంది.
వెళ్ళు మార్గం
పానగల్లు నల్గొండకు 3 km దూరంలోని గ్రామము.