info.manatemples@mail.com

+91 9866933582

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -పాలెం




నకిరేకల్ నుండి 10 కిమీ దూరం లో పాలెం గ్రామం లో సాలగ్రామ శీలా పై వామనంకిత లక్ష్మి సమేతుడై గరుడ పీటం పై స్వయంభు గ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన క్షేత్రం .17 వ శతాబ్దం లోదేవాలయ నిర్మాణం జరిగినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది .


ఆనాటి జమిందారులకు కలలో వచ్చిన స్వప్నమే ఈ దేవాలయ నిర్మాణానికి నాంది అని గాథ .వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో మహిమన్మిథమైనది. ఇక్కడికి వచ్చిస్వామి వారి సన్నిది లో వివాహ కంకణం దరించినవారికి వెంటనే కళ్యాణం జరుగుతుంది అని బక్తుల విశ్వాసం .అందుకే ఈ క్షేత్రానికి కంకణ నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు .ధ్వజ స్థంబం పై గరుడిని దర్శనం ఎంతో గాని ఆకట్టుకుంటుంది .


జీవితం లో ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించాల్సిన క్షేత్రం ఇది . ఆలయ నిర్మాణం పైన సుదర్శన చక్రం, ఆవరణ లో ఉన్న నాగ దేవత విగ్రహాలు చాల చూడ చక్కగా ఉంటాయి . ధనుర్మాసం, నృసింహ జయంతి ,ముక్కోటి ఏకాదశి ,ఇతర పండుగలకి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .


స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట .
ప్రత్యేక కార్యక్రామాలు :
వైకుంటా ఏకాదశి కి ,నరసింహ జయంతి కి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడును .


వెళ్ళు మార్గం :
నకిరేకల్ నుండి 10 కిమీ దూరం లో పాలెం గ్రామం లో ఈ క్షేత్రం ఉంటుంది .



The palem Lakshmi Narasimhar temple is situated in Nalgonda district near the town of Miryalaguda, at the confluence of the River Krishna and Musi River. These two rivers very unusually come together in the shape of an "L".