info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నిరా నర్సింహపూర్ Sri lakshmi narasimha swamy temple,mira narsimhapur,pune dist




పూణే జిల్లాలోని ఇందాపూర్ నుంచి 35 కి మీ దూరం లో ఉన్న చిన్న గ్రామం.ఇ గ్రామం లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది మరియు విశిష్ట చరిత్ర గలది. బీమా-నిరా నదులు అనుసంధానం గుడి కి అనుకోని వెళ్తూ ఉంటుంది..ఆ సుందరమైన ప్రదేశం చూడడానికి ఎంతో రమనీయంగా ఉంటుంది.ప్రహ్లాదుడి జన్మ స్థలమైన ఇ క్షేత్రం లో స్వామి వారి విగ్రహాము ప్రహ్లాదుడు ఇసుక తో చేసాడు అని స్థల పురాణం చెబుతుంది.
ఎందరో మహర్షులు,ఋషులు ఇక్కడ తపస్సు చేశారట..వ్యాస మహర్షి కూడా ఇ క్షేత్రం లో కొద్దీ రోజులు ఉన్నారు అని చరిత్ర.స్వామి సమార్థ రామదాసుల వారు ఇ క్షేత్రాన్ని తరుచుగా సందర్శించే వారు అని గాథ.రావణ వధ అనంతరం శ్రీ రామ చంద్రుల వారు ఇ క్షేత్రం నుంచి యాత్ర మొదలెట్టారు అని పురాణ గాథ.
మనకు ఇ క్షేత్రం లో లక్ష్మీ ఘాట్,నరసింహ తీర్త్ చూడడానికి సుందరంగా దర్శనం ఇస్తాయి. జీవిత కాలం లో ఒక్క సారి అయిన ఇలాంటి దేదీప్యమానమైన క్షేత్రాలని సందర్శించలి.నాకు ఆ నరసింహుడు ఒక సారి దర్శించి భాగ్యం కలిగించాడు.వర్ష కాలం లో అయితే ఇంకా రమనీయంగా ఉంటుంది..రెండు నదులలో పారే స్వచ్ఛమైన నీరు..గుడికి అనుకోని ప్రవాహం చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది.
నరసింహ జయంతి కి విశేసమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
వేళ్ళు మార్గం: పూణే నుంచి 155 కి మీ దూరం లో ఉంటుంది.
ముంబై సోలాపూర్ హైదరాబాద్ హై వే మార్గం లో Tembhurmani ప్రదేశం లో దిగితే అక్కడి నుండి 11కి మీ దూరం లో ఉంటుంది.
రైల్ మార్గం:kurduwadi స్టేషన్ కి 35 కి మీ దూరం లో ఉంటుంది.