info.manatemples@mail.com

+91 9866933582

మంథని దేవాలయాల సమూహం




కరీంనగర్ కి 70 కి మీ దూరం లో ఉన్న మంథని చారత్రిక వైభవం ఉన్న ప్రదేశం . ఈ పట్టణం లో అనేక దేవాలయాలు కొలువై ఉన్నయి. అందమైన గోదావరి నది ఒడ్డున అనేక ప్రాచీన క్షేత్రాలకు నిలయం ఈ ప్రాంతం . పురాతన కాలం నాటి నుండి ఈ ప్రాంతం వేద విద్యకు ,సాహితి సంస్కృతులకు ప్రముక్యాన్ని కలిగి ఉన్న ప్రదేశం . అనేక చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి .

శైలేశ్వర స్వామి దేవాలయం
లక్ష్మి నారాయణ స్వామి దేవాలయం
ఓంకారేశ్వర స్వామి దేవాలయం
మహాలక్షి అమ్మ వారి దేవాలయం
హనుమాన్ దేవాలయం
గౌతమెస్వర దేవాలయం
భిక్షేస్వర దేవాలయం
కోదండ రామాలయం
సిద్దేశ్వర స్వామి దేవాలయం



దేవాలయాల నిర్మాణం, వాటి పైన చెక్కబడిన శిల్ప సంపద ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది . శతాబ్దాల చరిత్ర గల దేవాలయాలు ..చాల వరకు సితిలవస్తలో ఉన్నాయి .


ఓంకారేశ్వర స్వామి దేవాలయం





మంథని పట్టణం లోని పశ్చిమ దిశలో గల తమ్మి చెరువుకట్ట సమీపం లో కొలువైన శైవ క్షేత్రం ఓంకారేశ్వర స్వామి దేవాలయం . ఈ దేవాలయం లో శివుడు లింగాకృతి లో కొలువై ఉన్నాడు . శివ లింగానికి వెనుక బాగం లో పార్వతి అమ్మవారు కొలువై ఉన్నారు . గర్భాలయం కు ఎదురుగా నంది కొలువై ఉన్నాడు . ఆలయ నిర్మాణం అంత బౌద్దుల శైలి లో నిర్మించడం జరిగింది . ఆలయ గోపురం ,ధ్వజ స్థంబం ఆకర్షనీయంగా ఉంటాయి . ప్రతి నిత్యం స్వామి వారికి పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . మహా శివరాత్రి సమయం లో విశేషమైన పూజ కార్యక్రామాలు నిర్వహిస్తారు .
వెళ్ళు మార్గం :- కరీంనగర్ నుండి వయ పెద్దపల్లి మీదుగా మంథని చేరుకోవొచ్చు ( సుమారు 70 కి మీ దూరం )





Omkareshwara Temple