info.manatemples@mail.com

+91 9866933582

రామలింగేశ్వర స్వామి దేవాలయం, మడికొండ, వరంగల్జిల్లా






వరంగల్జిల్లా మడికొండ గ్రామంలోని మెట్టుగుట్ట లో వెలసిన రామలింగేశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైనది మరియు ఎంతో విసిస్టత ను గల దేవాలయం ఇది !తెలుగు నెల కొన్ని శతాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు నిలయం .
శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటిచెప్పిన పుణ్యక్షేత్రం మెట్టుగుట్ట. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. రామలింగేశ్వర స్వామి దేవాలయం లో ని విగ్రహ స్వరూపం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. కాబట్టే ఈ క్షేత్రానికి 'దక్షిణ కాశీ'గా పేరొచ్చింది.


సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సంచరించిన సమయంలో...మెట్టుగుట్ట క్షేత్రానికి వచ్చి శివుడిని అర్చించినట్టు స్థానిక ఐతిహ్యం. అందుకే మెట్టు రామలింగేశ్వరాలయమన్న పేరు వచ్చింది. ఇక్కడున్న రామాలయమూ అంతే ప్రాచీనమైంది.
కాకతీయుల కాలం లో ,వేంగి చాళుక్యుల కాలం లో ఈ దేవాలయం ఎంతో దెదిప్యమనంగ వెలుగొందింది అని శాశనాల ద్వార తెలుస్తుంది . ఆ రోజుల్లో సామంత రాజుల దండ యాత్రలు ని అరికట్టడానికి అనువుగా ఉంటుంది అని కాకతీయులు ఇక్కడ కోటను నిర్మించారట .


పూర్వం కరవుతో అలమటిస్తున్న ఈ ప్రాంత ప్రజల కోసం మాండవ్య, మరీచి, శాండిల్యాది నవసిద్ధులు తపస్సు చేయగా...పరమ శివుడు సిద్ధేశ్వరమూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలు తెలియచేస్తున్నాయి. కొండమీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి పూజలందుకుంటున్నారు. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రంలో ధూపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని కానుకగా ఇచ్చారు. నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవ గుండాలూ ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపవినాశనిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవే. జీడి గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందంటారు. కన్ను గుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మిక. అందులో నాణెం వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు. మూడు యుగాల్లో ప్రసస్తి పొందిన క్షేత్రం ఇది .


పత్యేక పూజ కార్యక్రమాలు :
మహాశివరాత్రి ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి వేడుకలు, కార్తీక దీపోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంగా మెట్టుగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవంలో...తేరును లాగితే అవివాహితులకు కల్యాణయోగం ప్రాప్తిస్తుంది అని చెబుతుంటారు . మడికొండ గ్రామం లో వెలసిన ఇతర దేవాలయాలు

వేణుగోపాల స్వామి దేవాలయం
ఆంజనేయ స్వామి దేవాలయం
వెళ్ళు మార్గం : -
నిత్యం హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలనుంచి వందలాది బస్సులు మడికొండ హైవే మీదుగా హన్మకొండ, వరంగల్ వైపు వెళ్తుంటాయి. భక్తులు మడికొండ వద్ద బస్సుదిగి మెట్టుగుట్ట ఆలయానికి నడిచివెళ్లవచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో వచ్చే భక్తులకు కాజీపేట జంక్షన్ స్వాగతం పలుకుతుంది. ఇక్కడ దిగితే పక్కనే స్థానిక బస్టాండు ఉంటుంది. అక్కడ మడికొండ, ధర్మసాగర్, రాంపూర్, నారాయణగిరి, వేలేరు, పీసర రూటులో వెళ్లే ఏ బస్సు ఎక్కినా మడికొండ దగ్గర దిగి, మెట్టుగుట్ట క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు.