info.manatemples@mail.com

+91 9866933582

అది వరాహ స్వామి దేవాలయం - కమానపూర్
దశావతారాల్లో వరాహ అవతారం ప్రసిద్దమైనది . వరాహ అవతారం లో జల ప్రళయం లో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కోరల మీద అదిదేవుడు రక్షించాడని పురాణాలూ చెబుతున్నాయి . దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి,వేదములను కాపాడిన అవతారము. రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసులబారినుండి రక్షించిన స్వామి.


మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రదేశాల్లో ఆది వరాహ స్వామి విగ్రహాలు ఉన్నయి. అందులో ఒకటి తిరుమలలో కాగ మరొకటి ఇక్కడే ఉంది


కలియుగ ప్రారంబం లో శ్రీ వారు లక్ష్మి దేవిని వెతుక్కుంటూ వైకుంటం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు అశ్రయమిచ్చారని పురాణం కథనమ్. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామి ని దర్సించాకే తనను దర్శిస్తారని వరమిచ్చారట.


కరీంనగర్ జిల్లా కమానపూర్ గ్రామం (మండల కేంద్రం) లో ఒక బండ రాయి పైన చిన్న ఎలుక ఆకారం లో స్వామి వెలిసాడు . ఆది వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కనే ఉన్న మరో బండ పైన దర్శనం ఇస్తాయి .
స్థల పురాణం ప్రకారం సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామి వారు కనిపించి ఏమి కావాలని కోరగా అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరగా అప్పుడు స్వామి వారు ఒక బండరాయి లో వెలిసినట్లు శాసనాలు చెబుతున్నాయి . ఇక్కడ స్వామి వారి బయటే ఉంటారు .ఎలాంటి మందిరం కాని ,గోపురం కానీ ఉండదు .
స్వామి వారికి నిత్యం పూజ ల తో పాటు అభిషేకాలు ఘనంగా చేస్తుంటారు .వరాలు ఇచ్చే స్వామి గ కొలువై ఉన్నారు .
స్వామి వారు ఇక్కడ బయటే కొలువై ఉన్నారు . ఒక భక్తుడు దేవాలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన స్వామి వారు స్వప్నం లో నాకు ఎలాంటి మందిరాన్ని ,గోపురాన్ని నిర్మించావద్దు అని నేను బయటే కొలువై ఉంటాను అని చెప్పడం తో అతను నిర్మాణాన్ని విరమించుకున్నాడు అని స్థల పురాణం .
వెళ్ళు మార్గం :
కరీంనగర్ నుండి కమానపూర్ మీదుగా గోదావరిఖని కి ప్రత్యేక బస్ లు ఉంటాయి .
కరీంనగర్ నుండి గోదావరిఖని వచ్చి అక్కడి నుండి కమానపూర్ మీదుగా పెద్దపల్లి బస్ లు వెళ్తాయి .
ఈ దేవాలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ పెద్ద పల్లి . అక్కడి నుండి ఈ దేవాలయనికి ఆటో లు ,బస్ లో ఉంటాయి .