info.manatemples@mail.com

+91 9866933582

లక్షీనరసింహాస్వామి దేవాలయం-కదిరి


లక్షీనరసింహాస్వామి దేవాలయం నవ నారసింహ క్షేత్రాల లో ఒకటి. ఇక్కడి విశిష్టత ఏమిటంటే మరే నారసింహ క్షేత్రములో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతముగా దర్శనము ఇస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా జరుగుతాయి.
అనంతపురం జిల్లా కదిరి పట్టణం లో వెలసిన మహిమన్మితమైన నరసింహ క్షేత్రం ఇది . 13 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం విజయనగర రాజుల చక్కటి శిల్పకళ తో కూడుకున్నది . చుట్టూ ఎత్తైన ప్రహరి గోడలు ,నలుగు వైపులా నలుగు ప్రవేశ గోపురాలతో అత్యంత వైభవంగా ఉండే ఈ ఆలయం లో అద్బుతమైన శిల్ప సంపద ఉంది .


దశావతారాల్లో నృసింహ స్వామి నాలుగో అవతారం . ఇక్కడ ఆలయం లో నృసింహ స్వామి,అమృతవల్లి ,తాయారు, ప్రహలదులథొ కలసి దర్సనమిస్తారు . ఆలయానికి పశిమ్న ఉన్న గోపురం లో వెనుక బాగం లో ఒక కోనేరు ఉంది దిన్నె బ్రుగుతీర్తమని పిలుస్తారు . ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి .


ఖ అంటే విష్ణు పాదము , ఆద్రి అంటే కొండ అందుకీ ఈ పట్టణానికి కద్రి అనే పేరు . కాలక్రమేనా అది కదిరి గా మారింది అని చెబుతారు . ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేట కు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉన్నది.


ఏటా ఈ అలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ద చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ద పౌర్ణమి , చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.