info.manatemples@mail.com

+91 9866933582

పాప హరేశ్వర స్వామి దేవాలయం -ఖదిలే




నిర్మల్ పట్టణానికి సమీపం లో దిలావర్పూర్ గ్రామానికి 6 కి మీ దూరం లో వెలసిన పాపహరేశ్వర స్వామి దేవాలయం .సకల పాపాలు హరించే మహా దేవా దేవుడు. చుట్టు పచ్చని వాతావరణం, దట్టమైన అడవులు చూడడానికి ఎంతో రమణీయంగా,కళాత్మకంగా ఉంటుంది .
పరుశారాముడు ఈ ప్రాంతం లో తపస్సు చేసాడని స్థల పురాణం .పరుశారాముడుతండ్రి మాట విని తానూ చేసిన పాపాలకు పరిహారంగా ఈ క్షేత్రం లో శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది.తరువాత శివలింగం కొంచెం కదిలినట్లు జరిగింది అందుకే ఈ క్షెత్రాన్నికదిలే పపహరేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది అని చెబుతుంటారు. ఆలయానికి ఎదురుగా నంది కొలువై ఉంటుంది .ఆలయ ఆవరణ లో ఉన్న ధ్వజ స్థంబం,గోపురం చాల చూడ చక్కగా ఉంటాయి .

ఆలయం లో రక రకాల దేవతముర్తులు కొలువై ఉన్నారు . గణపతి ,బ్రహ్మ ,వరాహ ,విష్ణు మూర్తులు, మనకు దర్శనం ఇస్తారు చాలామంది బక్తులు ఇక్కడికి వచ్చి తము చేసిన పాపాలు కు పరిహారంగా స్వామి ని సేవ చేస్తుంటారు .