info.manatemples@mail.com

+91 9866933582

మదన గోపాల స్వామి దేవాలయం – జేటప్రోలు




విష్ణువు యొక్క పది అవతారాలలో తొమ్మిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాదిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి .


కొల్లాపూర్ పట్టణానికి 9 కి మీ దూరం లో వెలసిన్ ఈ క్షేత్రం సుమారు 16 వ శతాబ్దం లో రుక్మిణి, సత్యబామ సమేత మదన గోపాల స్వామి దేవాలయం నిర్మించబడినది . ఆలయ శిల్ప సౌందర్యం ఎవరి మనసైన ఆకట్టుకుంటుంది.


జేటప్రోలు ను జటవాయు క్షేత్రంగా కూడా పిలుస్తారు . భవిష్యోత్తర పురాణం లో ఈ క్షేత్ర మహత్యం వివరించడం జరిగింది . విజయనగర రాజుల కాలం లో ఈ దేవాలయం విశేషంగా అభిరుద్ది చెందింది . దేవాలయం నిర్మాణం ఎంతో అద్బుతంగా, రమణీయంగా ఉంటుంది .

ఈ క్షేత్రం లో జరుగు బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి .ఇవి చూడడానికి జిల్లా నుండే కాకా వేరే వేరే ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వస్తారు. ఇక్కడ గోకులాష్టమి చాల బాగా జరుపుతారు .