info.manatemples@mail.com

+91 9866933582

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం –జరాసంగం(మెదక్ జిల్లా )




హైదరాబాద్ నుంచి జాహిరాబాద్ (మెదక్ జిల్లా) వెళ్ళే మార్గం లో జాహిరాబాద్ కి 16 కి మీ దూరం లో జరాసంగం అని గ్రామం లో వెలసిన ప్రసిద్ద శైవ క్షేత్రం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం .


పూర్వం ఈ ప్రాంతం లో కేతకి వనమని ,శౌనకాది మునులు ఇక్కడ తపస్సు చేసారని పురాణాలు చెపుతునాయి . దక్షణా కాశిగా ప్రసిద్ది గాంచిన ఈ క్షేత్రం లో ఎక్కడ లేని విదంగా స్వామి వారకి కేతకీ (మొగలి) పుష్పాలతో పూజ జరుగుతుంది అందుకీ కేతకి సంగమేశ్వర స్వామి గ పేరు వచ్చింది అని స్కాంద పురాణం లో గాథ !!


బ్రహ్మ సృష్టి కార్యం పూర్తి చేసిన తరువాత కేతకి వనం లో, పరమేస్వరున్ని ధ్యానించగా భగ లింగాకరుడైన శివుడు ప్రత్యక్షమై ,బ్రహ్మ స్తాపించే కమండల జలం తో అబిషేకిస్తే, ఈ కేతకి వన ప్రదేశం లో శాశ్వతంగా పూజలు అందుకుంటు ఉండగలనని శివుడు వరమిస్తాడు . కేతకి అనే అప్సర శాప విమోచనం పొంది కేతకి వనంగా వెలసి , భగ లింగాకరుడైన శివుడు కేతకి పుష్పాలతో అర్చన పొందుతుందే వాడు . అందుకీ కేతకి సంగామేస్వరుడిగా నామం ఏర్పడింది అని స్కంద పురాణం గాథ.


స్వామి వారి ఆలయం లో ఉండే గుండాలని అమృత గుండం అంటారు. కాశి నుంచి జార ఒకటి వచ్చి ఇందులో కలుస్తుంది అని భక్తుల నమ్మకం అందుచేత దిన్న జరసంగం అంటారు అని పురాణం గాథ. ఇక్కడ గుండం లో నీరు తోడితే రెప్పపాటు కాలం లో నిండి పోతుంది అని చెప్తూ ఉంటారు .


శ్రావణ మాసం లో ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి అది చూడడానికి బక్తులు చాల మంది ఇక్కడికి వస్తు ఉంటారు . ప్రతి సంవత్సరమ మహాశివరాత్రి , కార్తిక మాసం ,విజయదశమి పర్వదినాలలో కేతకి సంగామేస్వరునికి ప్రత్తేక పూజలతో పాటు,నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్టారు .