info.manatemples@mail.com

+91 9866933582

కాలభైరవ దేవాలయం,భైరవునిపాడు


ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడు గ్రామం లోఅతి పురాతన త్రేతాయుగం లో (విశ్వామిత్రుడు సత్రశాల పుణ్య క్షేత్రం లో యాగం చేయుచుండగా రాక్షసులు ఇటు నుండి వస్తు ఆటంకం కలిగిస్తుండటంతో వాటి నుండి రక్షణ గా ఈ ప్రాంతంలో కాళ భైరవ స్వామి ని ప్రతిష్టించారని కధనం ) వేల సంవత్సరాల నుండి అటవీ ప్రాంతంలో ఈ విగ్రహం అలాగే ఉంది,
క్రమేనా ఈ ప్రాంతంలో జన వాసాలు ఏర్పడి స్వామివారి పేౠ మీదుగానే భైరవునిపాడు గ్రామం గా పేరు పెట్టుకున్నారు.నేటికి ఇదే పేరు వాడుకలో ఉంది కాల భైరవ ఆలయం లోని స్వామి వారి మూల విరాట్టు విగ్రహం. కాల భైరవుని అతి శక్తి వంత మైన దేవుడు గా ఈ ప్రాంతం లో నమ్ముతారు. కాళ భైరవ స్వామి వారిని దర్శించిన వారికి దుష్ట గ్రహాల పీడలు తొలగుతాయని భక్తులు చెపుతారు.ఈ ఆలయ పరిసరాల్లో రాత్రి వేళ ఒక శునకం(భైరవుడు) స్వామి వారి విగ్రహం వద్ద కాపల గా ఉంటుందట.రాత్రి 10 దాటితే ఈ ఆలయం లోకి ఎవరూ ప్రవేశించలేరు.ఆ ప్రాంతం కు ఎవరూ వెళ్లినా అక్కడ ఉండే శునకం అరిచి భయపెట్టి వెనుక్కు పంపుదని గ్రామస్తులు చెపుతారు దూర ప్రాంతాల వారు కూడా ఇక్కడ కు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ గ్రామం స్వామి వారి విగ్రహం ప్రాంతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. హైదరాబాద్ నుండి వచ్చేవారు సాగర్ నుండి ప్రధాన రోడ్డు లో 10 కిలోమీటర్లు ప్రయాణించి భైరవుడు పాడు చేరుకోవచ్చు,అలాగే గుంటూరు నుండి వచ్చే వారు మాచర్ల చేరుకుని ఆక్కడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.