info.manatemples@mail.com

+91 9866933582

సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము -భద్రాచలం




శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే !!

స్వయానా శివుడు పార్వతి దేవికి చెప్పిన విషయం ఒకసారి శ్రీరామ నామం పాటిస్తే వేయి విశ్నునామలు స్మరించినట్లే అని . అంతటి గొప్పది రామనామం .రామ బాణం కంటే రామ నామమే మహిమన్మితమైనది అని నిరూపించాడు హనుమ. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి అని పురాణాలూ చెబుతున్నాయి .
"రామ ఏవ పరంబ్ర్హమా, రామ ఏవ పరంతపః రామ ఏవ పరంతత్వ శ్రీ రామో బ్రహ్మ తారకం "

రామనామం వలన బ్రహ్మ హత్య పాపం ,మద్యపాన దోషం ,గురుపత్ని సంయోగ పాపములు సైతము రామనామ స్మరనచే హరించును . సకల కల్మష నాశక మంత్రం .


భద్రాచల నిలయుడైన శ్రీరాముని సేవించినవారు,సకల పాపా విముక్తులై తరిస్తారు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యకి ఎంతటి ప్రాదాన్యత ఉందొ అంతటి ప్రాదాన్యత భద్రాచల క్షేత్రానికి ఉన్నది .


క్రీ .శ 1658-87 సంవత్సరాల మద్య కాలం లో గోల్కొండ కోటను రాజదానిగా పాలించే తానాషా వద్ద మంత్రులగా ఉండిన అక్కన్న-మాదన్న ల మేనల్లుడైన కంచర్ల గోపన్న (భక్త రామదాసు ) భద్రాద్రికి తహసిలదుర్గ ఉంటూ అలయమను కట్టించారు అని చరిత్ర ఆదారంగా తెలుస్తుంది . శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్యం కల క్షేత్రం భద్రాచల దివ్య క్షేత్రం. భద్రుడు (రాముడు)అచలుడు (కొండ). రాముడు కొండ పైన నేలువున్నాడు కనుక క్షేత్రం భద్రాచలం గ ప్రసిద్దిచెందింది .


ఇతర క్షేత్రాలలో కోటిమందికి అన్నదానం చేస్తే కలుగు పుణ్యఫలం, కాశి క్షేత్రం లో వేయిమందికి చేస్తే కలుగు పుణ్య ఫలం శ్రీ భద్రాచల దివ్య క్షేత్రం లో ఒకరికి అన్నదానం చేసిన కలుగుతుంది అని బ్రహ్మ పురాణం చెబుతుంది .




ఎవరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కల్యానముర్తి ఆయన శ్రిరమచంద్రస్వామి వారిని సేవించుటకై భద్రాచల క్షేత్రానికి విచ్చేస్తారో వారు అక్షయమైన ఫలాన్ని పొందుతారు అని బ్రహ్మ పురాణం చెబుతుంది .












వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుండి 310 కిమీ దూరం లో భద్రాచలం