info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం - అమ్మాపల్లి




హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే మార్గం లో శంషాబాద్ కి అతి సమిపమలొ అమ్మపల్లి గ్రామం లో వెలసిన క్షేత్రం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవాలయం. భాగ్యనగరానికి అతి సమీపం లో వెలసిన మరో పురాతన పుణ్య క్షేత్రం ఇది . అర్చకుల సమాచారం ప్రకారం సుమారు 13 వ శతాబ్దంలో వేంగి రాజులూ ఈ ఆలయాన్ని నిర్మించారు!! 700 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని సందర్శించడం మన పూర్వ జన్మ సుకృతము !!


90 అడుగుల గాలి గోపురం ,విశాలమైన పుష్కరిణి భక్తులకు చాల ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది . నల్ల రాయి పైన తీర్చిదిద్దిన సీతా రామచంద్ర లక్ష్మన్ విగ్రహాలు భక్తులను పరవశానికి లోను చేస్తాయి!!
సిద్దులగుట్ట కి 3 కి మీ దూరం లో ఈ దేవాలయం ఉంది !!














వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే మార్గం లో శంషాబాద్ కి అతి సమిపమలొ అమ్మపల్లి గ్రామం

శ్రీ వెండికొండ సిద్దేశ్వర స్వామి దేవాలయం -సిద్దులగుట్ట




శంషాబాద్ సిద్దులగుట్ట లో 300 సంవత్సరాల చరిత్ర గల భవాని సమేతా విశ్వేశ్వర స్వామి వారు కొలువై ఉన్నరు. సిద్దేశ్వర స్వామి గ వెలుగొందుతున్నారు .


ఈ దేవాలయానికి ధ్వజ స్థంబం కాని ,గర్బ గుడికి పై కప్పు కాని ఉండదు . గర్బగుడికి నాలుగు వైపులా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.శిద్దెస్వర స్వామి ఆలయ ప్రాంగణం పర్వత పాద పీటం లో ఉంటుంది . పర్వతం శ్వేతా వర్ణం లో ఉంటుంది . అందుకీ ఇక్కడ స్వయం భు గ వెలిసిన సిద్దేశ్వర స్వామి ని వెండికొండ సిద్దేశ్వర స్వామి అని అంటారు!!


ఇక్కడ భక్తులు స్వయంగా స్వామి వారికి అర్చన ,అభిషేకాలు చేసుకుంటారు !! సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లో వివిధ రకాల గూడులో ఉన్నాయి.
శ్రీ భవాని దేవి ఆలయం
వీరభద్ర స్వామి దేవాలయం
విఘ్నేశ్వరా స్వామి ఆలయం
ఆంజనేయ స్వామి ఆలయం
సిద్దేశ్వర స్వామి ఆలయం వెనుక వైపు ఒక గుహ ఉంది . ఇక్కడ పూర్వం వ్రుషులు తపస్సు చేసుకునే వారు అని పురాణం కథనం !!
సిద్దేశ్వర స్వామి ఆలయం లో మరో ప్రత్హేకత ఉంది .ఇక్కడ సిద్దులబండ ఉంది. సిద్దులబండ పైన రెండు చేతులు ఉంచి మనసులో ఏదైనా తలుచుకుంటే సిద్దేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు అని భక్తుల నమ్మకం !! సిద్దులగుట్ట దేవాలయం ప్రశంతాతకు , అధ్యాత్మతకు కనువిందు కలిగిస్తుంది !!